మరోసారి సుప్రీంకోర్టుకు కళాశాలల యాజమాన్యాలు

హైదరాబాద్‌: బోధనాఫీజుల చెల్లింపులపై ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాయి. పిటషన్‌ వేసేందుకు కళాశాలల యాజమాన్యాలు ఢిల్లీ వెళ్లనున్నాయి. ఏకీకృత ఫీజులపై సుప్రీంకోర్టు ఆదేశాల అమల్లో జాప్యంపై మరో సారి సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లనున్నట్లు యాజమాన్యాలు మంగళవారం మీడియాకు తెలియజేశారు.