మరో జడ్జి లక్ష్మీనరసింహరావు అరెస్టు

హైదరాబాద్‌, జూలై 12 : గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ స్కాంలో మరో జడ్జి లక్ష్మీనరసింహారావును ఎసిబి అధికారులు గురువారంనాడు అరెస్టు చేశారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత ఆయన్ను ఎసిబి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదిలా ఉండగా లక్ష్మీనరసింహరావు ప్రస్తుతం సిటీ సివిల్‌ కోర్టు ప్రాంగణంలోని స్మాల్‌ కాజెస్‌ కోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. ఆయన్ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.