మల్లన్న భక్తులకు స్వైన్‌ఫ్లొ మందులు

కర్నూలు,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): శివరాత్రి సందర్భంగా శ్రీశైలంనకు వస్తున్న బక్తులకు ఆరోగ్య సమస్యలు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా స్వైన్‌ బారిన పడకుండా ముందుగానే మందుల పంపిణీ చేపట్టారు. శ్రీశైలం వెళ్లే పాదచారులకు దేవస్థానంలోని 15 కేంద్రాల్లో స్వైన్‌ఫ్లొకు ¬మియోపతి మందులు అందుబాటులో ఉంచారు. జిల్లాలో 2015లో స్వైన్‌ఫ్లొ పాజిటివ్‌ కేసులు 5 నమోదయ్యాయని వీటిలో ఒక్కరు మాత్రం మరణించారని దీని బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటే మంచిదన్నారు. గర్భిణులు, చిన్నపిల్లలు, రోగనిరోధక శక్తి ఉన్న వారు జనసమూహ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు మాస్క్‌ ధరించాలని సూచించారు.