మళ్లీ పాతరోజులు గుర్తుకొస్తున్నాయి
` 60 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం సాధించిందేంటి?
` రాష్ట్రంలో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది:కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి):కేసీఆర్‌కు సిట్ నోటీసులను నిరసిస్తూ ఆదివారం రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో బీఆరఎస్ నేతలు, కార్యకర్తలు కదిలారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకొచ్చాయని చెప్పారు. పార్టీ క్యాడర్‌కు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. మేడారం జాతర ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. దావోస్ ఒప్పందాల ద్వారా వచ్చిన పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో విÖడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు.“కేసీఆర్ నందినగర్ వస్తే అధికారికంగా 900 మంది పోలీసులను పెట్టారు. అనధికారికంగా ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుంది. హైదరాబాద్‌లో పట్టపగలే కాల్పులు, దోపిడీ ఘటనలు జరుగుతున్నాయి. యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ కొనసాగుతోంది. నల్లమలసాగర్ విషయంలో తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారు. రాష్టానికి నష్టం జరుగుతోంది. సింగరేణి బొగ్గు కుంభకోణం అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టమైన సమాధానం లేదు. సీబీఐ, సిట్టింగ్ జడ్జి విచారణ కోరుతుంటే ఎందుకు వెనక్కిపోతున్నారు? కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శాఖాపరమైన కమిటీ వేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ వ్యవహారంలో సజన్రెడ్డి కాల్ డేటా బయటకు తీస్తే అన్నీ బయటకు వస్తాయి. బీఆరఎస్ నిలదీస్తుంటే దష్టి మరల్చేందుకు సిట్‌ల పేరిట విచారణలు చేస్తున్నారు. పైశాచిక ఆనందం కోసం కేసీఆర్‌ను అంతసేపు కూర్చోబెట్టారు. ప్రజలకు ఒక్కొక్కటి అర్థమవుతున్నాయి.
ఒక్కొక్కటి తేలిపోతున్నాయి
ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదట్నుంచీ చెబుతున్న అబద్ధాలు ఒక్కొక్కటిగా తేలిపోతున్నాయి. మొదట వ్యాపార వేత్తలు, ఆ తర్వాత సినీ తారలు అన్నారు. ఇప్పుడు ఏవిÖ లేదని అంటున్నారు. ప్రభుత్వం ఇకనైనా పాలనపై దష్టి పెట్టాలి. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ మాకేముందని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో.. నాడు కేసీఆర్ ప్రభుత్వానికి కూడా అలాగే వచ్చింది. కాంగ్రెస్ పెద్దలు ఇకనైనా అసత్య ప్రచారం మానాలి. సజ్జనార్ జడ్జి కాదు.. ఆయన తీర్పు ఇస్తే ఎలా? అక్రమం అన్నది అభియోగం మాత్రమే.. తేల్చాల్సింది కోర్టులు. బీఆరఎస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఎక్కడికక్కడే జరుగుతుంది. పెద్ద సమావేశాలు, రోడ్ షోలు ఉండవు. మంచి ఫలితాలు సాధిస్తాం.
60 సార్లు దిల్లీ వెళ్లిన సీఎం సాధించిందేంటి?
కేంద్ర బడ్జెట్‌లో పేదలు, రైతు కూలీలకు ఉపయోగపడే ఉపాధి హావిÖని కుదించారు. ఎరువుల రాయితీ, ఆహార రాయితీతో పాటు స్వచ్ఛ భారత్‌కు నిధులు కూడా తగ్గించారు. వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్, ఫార్మాకు హైదరాబాద్ కేంద్రం అయితే.. బయో ఫార్మా తయారీకి రూ.పది వేల కోట్లు కేటాయించి తెలంగాణకు రూ.10 కూడా కేటాయించలేదు. దిల్లీకి 60 సార్లు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సాధించిందేంటి? రెండు పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా రాష్టానికి కలిగిన ప్రయోజనం సున్నా. తెలంగాణకు భాజపా ఇచ్చేది ఇదేనా?హై స్పీడ్ రైల్ కారిడార్ కేటాయించామని గొప్పగా చెబుతున్నారు. తెలంగాణ భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉంది.. కారిడార్ హైదరాబాద్ విÖదుగా వెళ్లక తప్పదు. ప్రత్యేకంగా ఇచ్చినట్లు చెప్పడం హాస్యాస్పదం” అని కేటీఆర్ అన్నారు.



