మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే 20 ఏళ్ళు అధికారంలోకి ఉంటుంది

– ఉత్తమ్ కుమార్ రెడ్డిపద్మావతికి పదవులే ముఖ్యం అభివృద్ధి శూన్యం – కోదాడలో బొల్లం, హుజూర్ నగర్ లో నేను మళ్లీ గెలుస్తాం – నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గానికి శుభాకాంక్షలు – ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ మార్చి 25 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాల్గవర్గం, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతగాని లక్ష్మమ్మ పదవి ప్రమాణ స్వీకారం సందర్భంగా దొంతగాని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కౌడిన్య ఫంక్షన్ హాల్ నుంచి పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతో, కోలాట బృందాలతో వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు. శనివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాజరైనారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్పర్సన్ గా దొంతగాని లక్ష్మమ్మ, వైస్ చైర్మన్ ముడెం రామలింగారెడ్డి, 16 మంది డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి మండలం, గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేశాం. దాదాపు 13 వేల మందికి సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతికి పదవులే ముఖ్యం కానీ నియోజకవర్గ అభివృద్ధి కాదన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి నియోజకవర్గ ప్రజలే నా బిడ్డలు అని అంటారు కానీ ఆ బిడ్డలకు ఏమి చేశారో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీకి శిక్ష వేస్తే కాంగ్రెస్ పార్టీలో ఎవరు మాట్లాడే నాయకులు లేరన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కే ఆ దమ్ము ధైర్యం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు, దళిత బంధు ఇస్తుంటే మహారాష్ట్ర ప్రజలు కూడా ఇవ్వాలని గొడవలు చేస్తే అందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తుందన్నారు. జనాలతో ఉండాలన్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్, అనేక నిధులు తీసుకవచ్చి హుజూర్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు కేసులతో ఆపు చేస్తున్నారన్నారు. మిర్యాలగూడలో ధాన్యం కొనుగోలు మాదిరిగా హుజూర్ నగర్ లో కేజీల తరుగు లేకుండా చేపిస్తామన్నారు. అలా కాకుండా మిల్లులు వాళ్ళు తరుగులు తీస్తే మిల్లులు మూపిస్తామన్నారు. కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్, ఇక్కడ నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలుస్తామన్నారు. ఎన్ ఎస్ పి కాలువ కట్టపై 200 మంది ఇల్లు కోల్పోయిన వారికి త్వరలోనే ఇల్లు అందజేస్తామన్నారు. ఏ పని మొదలుపెట్టిన ప్రతిపక్ష నాయకులు వెంటనే కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. హుజూర్ నగర్ మెయిన్ రోడ్డు ను కూడా త్వరగానే కంప్లీట్ చేపిస్తామన్నారు. హుజూర్ నగర్ లో ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా డివైడర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ హుజూర్ నగర్ లో సై యూత్ ద్వారా శానంపూడి సైదిరెడ్డి ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో ఉంచారన్నారు. రైతాంగానికి అహర్నిశలు కృషి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ఒకప్పుడు కరెంటు ఉంటే నీళ్లు లేక, నీళ్లు ఉంటే కరెంటు లేక నానా ఇబ్బందులు రైతులు పడేవారు. రైతులకు 24 గంటల కరెంటు, పుష్కలంగా పొలాలకు నీరు అందుతుందన్నారు. బ్యాంకుల ద్వారా రైతులకు లోన్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. రైతులకు యూరియా కొరత లేకుండా చేశారన్నారు. దేశంలో యావత్ ప్రజానీకానికి అన్నం పెడుతుంది అంటే కెసిఆర్ ప్రభుత్వమేనన్నారు. ఇప్పుడు చివరి భూములకు కూడా నీళ్లు అందుతున్నాయి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు దొరుకుతుందన్నారు. నల్లగొండలో ప్లోరోసిస్ ప్రారదోలిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకా రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి సంగయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గెల్లీ అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, వివిధ మండలాల మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.