మళ్లీ విజయం కాంగ్రెస్‌దే అన్న జ్యోతిరాదిత్య

న్యూఢిల్లీ,మార్చి12(జ‌నంసాక్షి):  హిందీరాష్ట్రాల్లో కాంగ్రెస్‌ మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో
బిజెపి ఓటమి, కాంగ్రెస్‌ విజయం కారణంగా ఉత్తరాదిన కాంగ్రెస్‌ ప్రభావం పెరిగిందని అన్నారు. మోడీ వైఫల్యాలను ప్రజలే గమనిస్తున్నారని, ఆయన హావిూలు ఒక్కటి కూడా నెరవేరలేదని తేలిపోయిందని అన్నారు. విూడీ ఐదేళ్ల పాలనలో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల  నేపథ్యంలో జ్యోతిరాదిత్య మాట్లాడుతూ బిజెపి పాలనను అంతమొందించాలని ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. కాంగ్రెస్‌ పునర్జీవనానికి బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికలలో పార్టీ ఘోర వైఫల్యాన్ని చవిచూసినప్పటికి అవకాశాలు కాంగ్రెస్‌కు మెరుగుపడుతున్నాయని అన్నారు.