మహంకాళీ ఆలయంలో చోరీకి నిరసనగా లాల్‌దర్వాజాలో ర్యాలీ

హైదరాబాద్‌: పాతబస్తీలోని లాల్‌దర్వాజా మహంకాళీ దేవాలయంలో చోరీకి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ కోరుతూ దేవాలయాల ఉమ్మడి కమిటీ ఆధ్వర్యంలో లాల్‌దర్వాజాలో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిందితులను అరెస్టు చేసేంతవరకు ఆలయాన్ని మూసివేస్తామని స్థానికులు ఆందోళనకు దిగారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ వారికి హామీ ఇచ్చారు