మహబూబ్‌నగర్‌లో రూ.260 కోట్లతో నమూనా పాఠశాలలు

బాలానగర్‌:మాద్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారది మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ పర్యటించారు.ఈ సందర్భంగా మండలం కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో రూ.260 కోట్లు వెచ్చిస్తామని తెలిపారు.ఈ పాఠశాలల్లో విద్యాభివృద్దికి అన్ని చర్యలు తీసుకుంటామిని వివరించారు.ఉచిత విద్యతోపాటు క్రీడలు కంప్యూటర్‌ కోర్సులు,వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు.జిల్లాలో గదులు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.జూనియర్‌ కళాశాలలు అవసరం అయి చోట్ల అక్కడి ఎంపీలు తమ నియోజకవర్గ అభివృద్ది నిదులు నుంచి 50శాతం ఇస్తే మిగతా 50శాతం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.జూనియర్‌ కళాశాలకు అదనపు నిర్మిస్తామని దీనికి రూ.20 లక్షల కేటాయిస్తున్నట్లు తెలిపారు.