మహబూబ్‌నగర్‌ అగ్నిప్రమాదంలో గాయపడిన ముగ్గురి మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని స్టెమ్‌కోర్‌ పరిశ్రమలో జరిగిన ఆగ్నిప్రమాదంలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ తరలించారు. ఉస్మానియా ఆస్పత్రిలో 8 మంది, అపోలో డీఆర్‌డీఏలో ముగ్గురు, ఓవైసీ ఆస్పత్రిలో ఇద్దరికి చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా బీహార్‌కి చెందినవారేనని, పరిహారం అందించేందుకు కృషిచేస్తామని కలెక్టర్‌ గిరిజా శంకర్‌ తెలియజేశారు.