మహారాజ్‌పూర్‌లో బస్సు బొల్తా : 14 మంది మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మహారాజ్‌పూర్‌ సమీపంలో బస్సు బొల్తా పడి 14 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. బస్సు హర్పాల్‌పూర్‌ నుంచి ఛత్రాపూర్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికార సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.