మహిళలకు ఇంటివద్దకే వెళ్లి సాయమందించాలి:గవర్నర్‌

హైదరాబాద్‌:భర్తను పోగొట్టుకున్న అభాగ్యులకు రావల్సిన ప్రయోజనాలు ఇంటివద్తకే వెళ్లి ఇచ్చేలా పరిస్థితులు మారాలని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు.లూంబా పౌండేషన్‌ అర్ధిక సహయంతో వితంతులకు కుట్టు మిషన్లు తండ్రిని కోల్పోయిన పిల్లలకు ఉపకార వేతనాలు పంపీణ చేశారు.ఆ సంస్థ ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు.ఉద్యోగి చనిపోయినప్పుడు భార్యకు ఇచ్చే ప్రయోజనం కోసం కార్యాలయాల చుట్టూ తిప్పుకొనే పరిస్థితుల్లో మార్పురావాలని గవర్నర్‌ అన్నారు.భర్తను కోల్పోయిన వారికి సాయం చేసున్న లూంబా సంస్థ కార్యక్రమాలకు హజరైనందుకు సంతోషంగా ఉందన్నారు.తన సోదరుడు 42 ఏళ్ల వయసులోనే చనిపోగా అతని పిల్లలను చదివించి పైకి తీసుకురావడానికి చాలా కష్ట పడాల్సివచ్చిందని గవర్నర్‌ తెలిపారు. పోషణ కష్టమై పిల్లలను చదివించలేక పనులు చేయిసున్నారని విపత్తుల సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిదర్‌రెడ్డి చెప్పారు.