మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

మద్దూరు డిసెంబర్ 9 జనం సాక్షికొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల పరిధిలోని పల్లెగడ్డ తాండ లో శనివారం రోజు ఆరు గ్యారంటీల లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి సంతకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సందర్బంగా పల్లెగడ్డ తాండ మహిళలు, గ్రామ పెద్దలు, వార్డ్ మెంబెర్స్, యువకులు, యువతులు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫోటోకి పాలాభిషేఖం చేయడం జరిగింది, మరియు సోనియా గాంధీ జన్మదిన సందర్బంగా స్వీట్స్ పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దోరెపల్లి మాజీ సర్పంచ్,మరియు ఎం,పి,టీ,సి సీత బాయి, తాండ అధ్యక్షులు కిష్ట్యా నాయక్, వార్డ్ మెంబెర్స్,చందర్ నాయక్,శీను నాయక్,తాండ వాసులు,కిషన్ నాయక్,వెంకటేష్,వెంకట్ నాయక్,రవి నాయక్,సంజీవ్,ఆనంద్, సంతోష్,తుల్సీ బాయి, లక్ష్మి బాయి, మేగ్లీ బాయి, శాంతి బాయి,తదితరులు పాల్గొన్నారు.