మహిళలకోసం ఎన్నో చట్టాలు ఉన్నా వాటి అమలులో లోపాలు జాప్యం: సుభాషణ్‌రెడ్డి

హైదరాబాద్‌: దశాబ్దాలుగా మహిళలు ఇంటా బయటా వివక్షకు గురవుతూనే ఉన్నారని మానవహక్కుల కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి అన్నారు. బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన అంకురం వ్వవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళలకోసం ఎన్నో చట్టాలు ఉన్నా వాటి అమలులో జరుగుతున్న లోపాలు, జాప్యం మూలంగా న్యాం జరగటంలేదని ఆయన అన్నారు.