మహిళలపై దాడులు నిరసిస్తూ మహిళల ధర్నా

హైదరాబాద్‌: మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, దాడులను ఆరికట్టాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లో మహిళాసంఘాలు, స్వచ్ఛందనసంస్థలు నిరసన చేపట్టాయి. ఢిల్లీలో వైద్య విద్యార్ధినిపై జరిగిన సామూహిక అత్యాచారానికి వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద నల్లరిబ్బన్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా  శాంతియుత ధర్నా నిర్వహించారు. దేశ రాజధానిలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రోజురోజుకు అత్యాచారాలు, దాడులు పెరిగిపోతున్నాయని మహిళసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కఠిన చర్చలు తీసుకోకపోవటం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని తీవ్రంగా మండి పడ్డారు. ధర్నా అనంతరం ఇక్కడకు వచ్చిన మహిళలు ఇందిరాపార్కు రోడ్డులో  నిరసన ప్రదర్శన నిర్వహించారు.

తాజావార్తలు