మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యం: సీఎం

హైదరాబాద్‌: వ్యవసాయ యంత్రాలపై 50 శాతం రాయితీని ప్రభుత్వం భరిస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా ఆయన పినపాక మండలం ఐలాపురంలో రూ. 700 కోట్ల అభివృద్ధి వసులకు శంకుస్ధాపన చేశారు. అనంతరం మహిళాసంఘాలకు రూ. 115 కోట్ల లింకేజి రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం అన్ని కార్యక్రమాల్లో వారికి భాగస్వామ్యం కల్పిస్తున్నామన్నారు.