మహిళల పట్ల గౌరవంతో కూడిన మార్పు పురుషుల్లో రావాలి
సుప్రీం మాజీ న్యాయమూర్తి వెంకటరామిరెడ్డి
హైదరాబాద్: సమాజంలో మహిళల పట్ల పురుషుల్లో గౌరవంతో కూడిన మార్పు రావాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి వెంకటరామిరెడ్డి అన్నారు. మహిళలపై జరుగుతున్న లైంగిక హింస, సమస్య మూలాలు, పరిష్కారాలపై హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రాష్ట్ర జ్యూడీషియల్ అకాడమీ నిర్వహిస్తున్న మేధోమథన సదస్సుకు వెంకటరామరెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవరించిన వారిపై కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఎవ్వరూ మద్దతు ఇవ్వొద్దని సూచించారు. అత్యాచార కేసు విచారణను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని.. బాధితులకు పూర్తి రక్షణ, వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.