మహీంద్రా సంస్థకు ప్రచారకర్తగా మహేశ్‌బాబు

హైదరాబాద్‌: ట్రాక్టర్ల తయారీలో పేరొందిన మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ మార్కెట్‌ను విస్తృతం చేసుకునేందుకు సిద్థమైంది. ఇందుకు ప్రిన్స్‌ మహేశ్‌ బాబుని ట్రాక్టర్‌ ఉత్పత్తులకు ప్రచార కర్తగా నియమించుకుంది. రెండేళ్ల కాలపరిమితికి గాను మహేశ్‌ ఈ ట్రాక్టర్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తారని సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ గోయల్‌ ప్రకటించారు. దేశీయంగా వర్షాభావ పరిస్థితుల వల్ల ట్రక్టర్ల అమ్మకం ఈ సంవత్సరంలో 5 శాతానికి పైగా తగ్గిందని. ఈ ఒప్పందంతో తమ అమ్మకాలు వృద్థి చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.