మాజీ డీజీపీ సుకుమార కన్నుమూత
హైదరాబాద్: రాష్ట్ర మాజీ డీజీపీ ఎన్‌ఆర్ సుకుమార అనారోగ్యంతో కన్నుమూశారు. బంజారాహిల్స్ రోడ్డునెం 5 లోని అతని స్వగృహంలో నిన్న రాత్రి మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు. ఈయన 1967 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారిరాష్ట్రంలో అనేక జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2003లోరాష్ట్ర డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మృతదేహాన్ని రాష్ట్ర డీజీపీ దినేష్ రెడ్డితో పాటు పోలీసు ఉన్నతాధికారులు బాసిత్, గౌతమ్‌కుమార్, అరవింద్‌కుమార్, మహంతీ, సీతారామరావు తదితరులు నివాళులర్పించారు. పంజాగుట్టలోని స్మశనావాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలియజేశారు.