మాజీ సైన్యాధ్యక్షుడు వీకే సింగ్‌ భద్రత ఉపసంహరణ

న్యూఢిల్లీ : మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్‌ వీకే సింగ్‌ భద్రత ఏర్పాట్లను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకుంది. విశ్రాంత  సైన్యాధికారులకు రిటైరైన తర్వాత అర్నెల్లపాటు జడ్‌ ప్లన్‌ కేటగిరి రక్షణ కల్పిస్తారని, ఆర్నెల్ల తర్వాత పరిస్థితులను సమీక్షించి భద్రత  ఉపసంహరణ జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. వీకే సింగ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్టాడడం, ఆందోళనకారులతో కలిసి ప్రదర్శనల్లో పాల్గొనడం తదితర చర్చల కారణంగానే ఆయన భద్రత ఉపసంహరించారని వస్తున్న ఆరోపణలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి.