మానవత్వం చాటుకున్న ఖమ్మం బిల్డర్స్ అసోసియేషన్.
– వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ.
బూర్గంపహాడ్ ఆగష్టు25 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో
ఇటీవల వచ్చిన గోదారి వరదల వలన సర్వం కోల్పోయిన మండలంలోని వరద బాధితులకు తమ వంతు సాయంగా ఖమ్మం బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిత్యవసర సరుకులు అందజేశారు. మండలంలోని చింతకుంట, మోతే, నాగినేనిప్రోలు ఎస్సీ కాలనీ ఒక వీధి వాసుల కు నిత్యవసర సరుకులు సుమారు 170 మందికి అందజేశారు. భద్రాచలంలోని ఏఎంసీ కాలనీలో ఉన్న వరద బాధితులకు సుమారు వందమందికి నిత్యవసర వరకు సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తుంపాల కృష్ణమోహన్, కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి నాగేశ్వరావు, పోలినేని శ్రీనివాసరావు, తంగెళ్లపల్లి శ్రీనివాసరావు, ఐటిసి గుర్తింపు సంఘం టిఎన్టియుసి చైర్మన్ గల్లా నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.