మానసిక వికలాంగులకు విస్తృత సేవలు

శ్రీకాకుళం, జూలై 31 : జిల్లాలో ఉన్న మానసిక వికలాంగులను గుర్తించి, వారికి విస్తృత సేవలందించాలని రాజీవ్‌ విద్యామిషన్‌ మాస్టర్‌ ట్రైనర్స్‌ యు.మహేశ్వరి, రమేష్‌, వై.శ్రీదేవి అన్నారు. ఎచ్చెర్లలోని సాంకేతిక శిక్షణాభివృద్ధి కేంద్రంలో జిల్లాలోని బుద్ధిమాంద్యం, శారీరక, చెవిటి, మూగ పిల్లలకు సేవలందించేందుకు గాను ఎంపిక చేసిన ఐటెర్నైట్‌ ట్రైనీ సిబ్బందికి శిక్షణ నిర్వహిరచారు. 2009-11 విద్యా సంవత్సరంలో వమ్మరవల్లి డైట్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 102 మందిని ఐటర్నైట్‌ ట్రైనర్స్‌గా నియమించినట్లు చెప్పారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ. 4,500 జీతం చెల్లిస్తుందని చెప్పారు. వికలాంగుల ప్రత్యేక అవసరాల కేంద్రం(ఐఈఆర్‌సీ) పరిధిలో ముగ్గురుని చొప్పున వీరిని నియమించినట్లు చెప్పారు. ఐఈఆర్‌సీ కేంద్రాల్లో ప్రతి సోమ, బుధవారాల్లో ఫిజియోథెరపీ, మిగతా రోజుల్లో స్పీచ్‌థెరపీ, పేరెంట్స్‌ కౌన్సెలింగ్‌, హోమ్‌ బేసిడ్‌ శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించాలని వారికి సూచించారు.