మాయావతికి ఊరట

లక్నో : ఉత్తరప్రదేశ్‌మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై ఉన్న తాజ్‌ కారిడార్‌ కేసులో ఆమెకు ఊరట లభించింది. ఆమెపై అధికారంలో ఉండగా తాజ్‌కారిడార్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రజాప్రయోజనవ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. దీంతో  ఆ పిటిషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు, లక్నో డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. ఉత్తరప్రదేశ్‌లో దళిత ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేసిన మాయావతి అధికారం కోల్పోయిన తరువాత ఆమెపై పిటిషన్‌ వేశారు. బహుజన సమాజ్‌ పార్టీ నాయకురాలిగా తనదైన శైలిలో పరిపాలన సాగించిన మాయావతి తన  విగ్రహాలను ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటు చేయడాన్ని కూడా వ్యతిరేకించారు. దీనిపై కూడా రాజకీయ రగడ జరిగింది. దీంతో గతంలో జరిగిన ఎన్నికల్లో మాయావతి ఓటమి పాలవడంతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత మూలాయాం సింగ్‌ యాదవ్‌ కుమారుడైన అఖిలేష్‌ యాదవ్‌ అధికారాన్ని చేజిక్కించుకున్నారు.