మారునాయుధంతో తిరుగుతున్న వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష

సికింద్రాబాద్ (జనం సాక్షి ):                 అనుమానాస్పదంగా    మారునాయుధంతో   తిరుగుతున్న వ్యక్తి  ని    అరెస్ట్ చేసి జైలకు  తరలించిన  సంఘటన    చిలకలగూడ    పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.    సర్కిల్ ఇన్స్పెక్టర్  గోదేశీ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం    వెంకట్    (24 )   తండ్రి  నర్సయ్య  మెట్టుగూడ లో అనుమాన స్పదంగా తిరుగుతున్నా కారణంగా చిలకలగూడ   పోలీస్ లు   అతడిని  ప్రశ్నించి  సోదా చేయగా అతని దగర ఒక కత్తి దొరికింది .   వెంకట్   వ్యక్తి    మెట్టుగూడ ఆంటోనీ   చర్చ్ యొక్క అద్దాలను రాళ్లతో     కొట్టాడని   విచారించగా   తెల్సింది .  వెంటనే అతడినీ కస్టడి  లో తీసుకునీ  పలు సెక్షన్ ల  క్రింద   కేసు నమోదు చేశారు.  మేజిస్ట్రేట్ యందు హజరు పరచగా అతనికి మూడు నెలలు  జైల్ శిక్ష విధించరు.