మారుపేర్లతో డీఎస్సీ రాస్తున్న నలుగురి అరెస్టు

కాకినాడ నగరం: కాకినాడ జగన్నాధపురం సెయింట్‌ ఆన్స్‌ ఎయిడెడ్‌ స్కూల్‌లో మారుపేర్లతో డీఎస్సీ రాస్తున్న నలుగురు అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సురేశ్‌రెడ్డి అనే అభ్యర్థికి సహకరించేందుకు నలుగురు యువకులు అదే పేరుతో దరఖాస్తు చేసుకోగా వారందరికి ఒకే గది కేటాయించారు. పరీక్ష రాస్తున్న అసలు అభ్యర్థి సురేష్‌ రెడ్డికి ఈ నలుగురు జవాబులు చెబుతుండగా నిర్వాహకులు వీరిని పట్టుకుని అరెస్టు చేశారు. కేసును ఒకటో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.