మారేడ్‌పల్లి పీఎస్ వద్ద ఉద్రిక్తత

సికింద్రాబాద్‌లోని మారేడ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌పై స్థానికులు దాడి చేశారు. ఓ కేసు విచారణ కోసం అదుపులోకి తీసుకున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో పీఎస్‌లోనే మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు స్టేషన్‌పై అటాక్ చేశారు. ఈ దాడిలో ఎస్‌ఐతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పీఎస్‌లోని ఫర్నీచర్ ధ్వంసమైంది.