మార్కెట్‌ యార్డు కార్యదర్శిపై రైతుల దాడి

మహబూబ్‌నగర్‌: గిట్టుబాటు ధర ఇవ్వటం లేదని దేవరకద్ర మార్కెట్‌ యార్డు కార్యదర్శి యాదగిరిరెడ్డిపై రైతులు దాడిచేశారు. ధాన్యం ధరలు తగ్గించారంటూ రైతులు ఆందోళనకు దిగటంతో తీవ్ర ఉద్రిక్తత నెలకోంది. ఆముదాల ధర రూ.3,500ల నుంచి రూ.2,500లకు తగ్గించారని రైతులు ఆరోపించారు. రాయచూర్‌- హైదరాబాద్‌ అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు ధర్నాకు దిగడంతో వాహనాల  రాకపోకలు నిలిచిపోయాయి.