మార్చి 16 నుంచి ఓపెన్ స్కూల్ ప్రవేశాలు
హైదరాబాద్ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్ఐఓఎస్) ప్రవేశాల ప్రక్రియ మార్చి 16 నుంచి ప్రారంభమవుతుందని సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి కోసం రూ.1350, ఇంటర్ కోసం రూ.1500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.