మార్చ్‌కు మద్దతుగా వరంగల్లు జైల్లో రాజకీయ ఖైదీల దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అపూర్వంగా జరిగే తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా వరంగల్‌ సెంట్రల్‌ జైల్లో మావోయిస్టు పార్టీ చెందిన రాజకీయ ఖైదీలు, ఇతర ఖైదీలు దీక్ష చేపట్టారు. తెలంగాణ రాఫ్ట్రాని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. తమ ఆకాంక్షలను జైలు గోడలు ఆపలేవని తాము ఈ దీక్ష చేపట్టినట్టు వారు తమ సందేశాన్ని మీడియా కు పంపించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు కదిలి మార్చ్‌ను విజయవతం చేయాలని కోరారు.  పోలీసులు అడ్డుకుంటే ఎక్కడికక్కడ మార్చ్‌ చేయాల్సిందేనని  అన్నారు. ఈ దీక్ష చేపట్టిన వారిలో వారణాసి సుబ్రమణ్యం, జైల్లోనే ఉన్న టీపీఎఫ్‌ ప్రధాని కార్యదర్శి నలమాస కృష్ణ తదితర రాజకీయ ఖైదీలు ఉన్నారు.