మార్చ్‌పై పోలీస్‌ల ఓవరాక్షన్‌

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌ సర్కార్‌ ‘ మార్చ్‌’ కు అనుమతి ఇచ్చినా తెలంగాణ జిల్లాల్లో పోలీసులు జులుం కొనసాగుతూనే ఉంది. పల్లెల నుంచి నగరానికి తరలివస్తున్న తెలంగాణ వాదులను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. పోలీసులను అరెస్టులపై తెలంగాణ వాదులు ప్రశ్నిస్తే ప్రభుత్వం, డీజీపీ ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామని చెబుతున్నారు. మార్చ్‌ను విఫలయత్నం చేసేందుకు పోలీసులు తీవ్రంగా కుట్రలు పన్నుతున్నారు. జిల్లాల నుంచి వచ్చే వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు. అయినా కూడా  తెలంగాణ వాదులు పట్టు వీడకుండా హైదరాబాద్‌కు  చేరుకుంటున్నారు.