మాలమహానాడు కార్యకర్తల ఆందోళన

హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మాణం చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ మాలమహానాడు కార్యకర్తలు కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశం జరుగుతన్న ఎల్బీ స్టేడియం ముందు ఆందోళనకు దిగారు. స్టేడియంలో వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.