మాలే విమానాశ్రయ బాధ్యతలను ప్రభుత్వానికి అప్పగించిన జీఎంఆర్‌

మాలే: జీఎంఆర్‌ సంస్థ నిర్వహణలో ఉన్న మాలే ఎయిర్‌పోర్టు బాధ్యతలను మాల్దీవుల ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సింగపూర్‌ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మాలెలోని ఇబ్రహిం నసీర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్‌ సంస్థ మాల్దీవుల ఎయిర్‌ పోర్టు కంపెనీ అధారిటీకీ అప్పగించింది. ఏయిర్‌పోర్టులో 77 శాతం వాటా ఉన్న జీఎంఆర్‌ సంస్థ 2010 నుంచి 25 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు చేపట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అయితే మాల్దీవుల ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని నవంబర్‌ 27న రద్దు చేసింది. ఎయిర్‌పోర్టు బాధ్యతలను అప్పగించాల్సిందిగా డిసెంబర్‌ 1న వారం రోజుల గడువును జీఎంఆర్‌కు ఇచ్చింది. దీంతో ఎయిర్‌పోర్టు నిర్వహణ బాధ్యతలను జీఎంఆర్‌ సంస్థ ప్రభుత్వానికి అప్పగించింది.