మావోయిస్టులకు సహకరిస్తున్నారని అరెస్టు

విశాఖపట్నం: మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న కారణంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) లోని బడదురల్‌ గ్రామంలో సర్పంచ్‌, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరనుంచి పోలీసులు రెండు మందుపాతలు, ఒక తపంచా స్వాధీనం చేసుకున్నారు.