మినిస్టీరియల్‌ సిబ్బంది సమావేశం

సిద్దిపేట:ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌.ఆర్‌డబ్ల్యూఎన్‌,ఇంజినీరింగ్‌ శాఖల మినిస్టీరియల్‌ ఎంప్లాయిన్‌ అసోసియేషన్‌ జిల్లాస్థాయి సమావేశం ఈ నెల 9వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలోని గ్రామీణ నీటి సరఫరా విభాగం  ఎన్‌ ఈ కార్యాలయం  ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు పత్రియాదగిరి ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి నాదన్‌అలీలు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ.హాజరుకనున్నారని పేర్కొన్నారు.42 రోజుల సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటించాలని,డీఏ వెంటనే ప్రకటించాలని,జీఓ 146 ప్రకారం బదిలీ కౌన్సిలింగ్‌  నిర్వహించాలని, జీఓ 360 ప్రకారం అక్రమ డిప్యుటేషన్‌లు రద్దు చేయాలనే డిమాండ్లపై సమావేశంలో చర్చిస్తారని తెలియజేశారు. జిల్లాలోని  ప్రతి ఒక ఉద్యోగి సమావేశాన్నికి హాజరై విజయవంతం చేయాలని తెలిపారు.