మియాపూర్‌లోని నాలుగు ఇళ్లలో భారీ చోరీ

హైదరాబాద్‌: మియాపూర్‌లోని డాల్ఫిన్‌ ఎస్టేట్స్‌లో నాలుగు ఇళ్లలో భారీ చోరీ జరిగింది. 60 తులాల బంగారు నగలను, కేజిన్నర వెండి వస్తువులను గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.