మిర్యాలగూడ మండలాల్లో అంధకారం

నల్గొండ: మిర్యాలగూడలోని 220 ఉపకేంద్రం పరిధిలో గురువారం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో మిర్యాలగూడ, సూర్యాపేట, హుజూర్‌నగర్‌, హాలియా మండలాల్లో అంధకారం నెలకొంది. ఇక్కడ అనధికారికంగా రోజుకు 12 గంటలకు పైగా విద్యుత్తు కోత విధిస్తున్నారు.