ముంబయిలో 45 కి.మీ భారీ మానవహారం
ముంబయి : సంత్‌నిరంకారి మండల్ ఆధ్వర్యంలో ముంబయిలో 45 కిలో మీటర్ల భారీ మానవహారం చేపట్టారు. ట్రిడెంట్ హోటల్ నుంచి ఈ ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో 4,500 మంది భక్తులు పాల్గొన్నారు. మానవ సమాజంలో ఐక్యత, శాంతి స్థాపన కోసం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వహకులు తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు, స్థానికులు పాల్గోన్నారు. అత్యాచార ఘటనలో దోఘలను కఠినంగా శిక్షంచాలని డిమాండ్ వ్యక్తం చేశారు.