ముఖ్యమంత్రా ? ఫ్యాక్షనిస్టా ?
నిండా ముంచే పోలవరంను కట్టి తీరుతామని సవాల్ చేసుడేంది !
కోర్టు దిక్కరణతో పోలవరం కట్టుడేంది
సీఎం వైఖరిపై మండిపడ్డ కోదండరాం
హైదరాబాద్ ,ఆగస్టు 26 (జనంసాక్షి):
పోలవరం ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫ్యాక్షన్ లీడర్లా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ ఆచార్య కోదండరాం వ్యాఖ్యానించారు. తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కేడర్ సంఘం సర్వ సభ్య సమావేశంలో కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీర్, మాజీ ఎంపీ వినోద్ హాజరయ్యారు. కోర్టు ధిక్కరణ చేస్తూ పోలవరం ప్రాజెక్టు కట్టి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని కోదండరాం డిమాండ్ వ్యక్తం చేశారు. రాష్ట్రం విద్యుత్ సంక్షోభంలో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి త్వరలో ఇందిరమ్మ విసన కర్రల పథకం, సోనియాగాంధీ ఇన్వర్టర్ల రాయితీ పథకం ప్రారంభిస్తారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిన రోజునే ప్రత్యేక తెలంగాణ పోరు ప్రారంభమైందని వినోద్ స్పష్టం చేశారు.