ముఖ్యమంత్రితో డీజీపీ సమావేశం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో డీజీపీ దినేశ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ వ్యవహారంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు సీఎం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి అక్బరుద్దీన్‌ అంశంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించినట్లు తెలుస్తోంది.