ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి పరిశ్రమల యజమానులతో చిర్చంచాలి: ఐ.ఎన్‌.టి.యు.సి

హైదరాబాద్‌ : విద్యుత్తు సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంస్థ ఐ.ఎణ&.టి.యు.సి తీవ్రంగా మండిపడింది. విద్యుత్తు కోతల కారణంగా రాష్ట్రంలో లక్షలాదిమంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రఘవరాజు చెప్పారు. పరిశ్రమల యాజమానులు నిరాహారదీక్ష చేస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్పందించి పరిశ్రమల యాజమానులను చర్చలను పిలవాలని డిమాండ్‌ చేశారు.