ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి., తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు మళ్లీ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సీఎంతో మాట్లాడేంత వరకు తమూ ఇక్కడి నుంచి కదలమని తేల్చిచెబుతున్నారు. సీమాంధ్ర పోలీసులు మాత్రం ఎంపీలను అనుమతించటం లేదు. క్యాంపు కార్యాలయం చుట్టూ భద్రత బలగాలను మోహరించారు.