ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి: నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణపై శాసనసభలో తర్మానం వీగిపోతుందని రాష్ట్ర ముఖ్మమంత్రి చెప్పడం అవమానకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శిచారు. పార్టీల వారీగా నిర్ణయాలు తీసుకున్న తర్వాత వివ్‌జారీ చేసి తీర్మానం ప్రవేశపెడితే ఎందుకు నెగ్గదని ప్రశ్నించారు. కేంద్రం చేతగానితనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి భూజనవేసుకుని ప్రజానీకాన్ని మోసం చేసేందుకు ఇలాంటి ప్రకటన చేశారని మండిపడ్డారు. తీర్మానం వీగిపోతుందని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని లేదంటే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.