ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు భరోసా

రూ.30 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన
మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు

 

సీఎం సహాయనిధి పేదలకు వరమని మెదక్ ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు అన్నారు. శుక్రవారం మెదక్ లోని క్యాంప్ కార్యాలయంలో మెదక్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశారు. మొత్తం 58 లబ్ధిదారులకు రూ.30,20,500/- విలువ గల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు వేలాదిమంది పేదలకు సీఎం సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్‌ ఏడాదికో, రెండేళ్లకోసారి వచ్చేదని గుర్తుచేశారు.
ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరంతర ఆర్థిక సహాయం అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్,మెదక్ జెడ్పి ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షులు యం.గంగాధర్, కౌన్సిలర్ ఆర్ కే.శ్రీనివాస్,ఏం సి డైరెక్టర్ సాప. సాయిలు, నాయకులు రాగి అశోక్, శ్రీధర్ యాదవ్, బొద్దుల. ప్రవీణ్ గౌడ్, కృష్ణ, మధు, బాలయ్య, వెంకట్రావు, శ్రీనివాస్ మెదక్ నియోజకవర్గంలోని సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

జనం సాక్షి ప్రతినిధి మెదక్ రూ.30 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన
మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేంద