ముగిసిన ఎపి కేబినెట్ భేటీ… 

హైదరాబాద్: ఎపి కేబినెట్ భేటీ ముగిసింది. ఆరు గంటలపాటు సమావేశం కొనసాగింది. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాలని తీర్మానించాయి. ఎపిలో నమోదైన కేసులను విచారించాలని నిర్ణయం తీసుకున్నాయి. గవర్నర్ అధికారాలపై కేబినెట్ పలు తీర్మాణాలు చేసినట్లు తెలుస్తోంది. 13 జిల్లాలో నమోదు అయిన 87 కేసులకు సంబంధించి త్వరితగతిన విచారణ చేసి… సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని యోచిస్తుంది. విజయవాడలో మత్తయ్య పెట్టిన కేసును కూడా విచారణ చేయాలని ఆలోచిస్తుంది.