ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ 

హైదరాబాద్: సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టి. సర్కార్‌ సీఎం చంద్రబాబు ఫోన్‌ ట్యాప్‌ చేయడంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ -8ని సమంగ్రంగా అమలు చేయాలని కేబినెట్‌ తీర్మానం చేసింది. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలు దేరి వెళ్లారు.