ముగిసిన టీఆర్‌ఎస్‌ మేధోమథన సదస్సు

కరీంనగర్‌ : రెండు రోజుల పాటు జరిగిన టీఆర్‌ఎస్‌ మేధోమథన సదస్సు గురువారం మధ్యాహ్నం ముగిసింది, ఈసమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. భవిష్యత్‌ కార్యాచరణను కేసీఆర్‌ ఇవాళ సాయంత్రం ప్రకటించనున్నారు. కేసీఆర్‌ మీడియాతో సాయంత్రం 4 గంటలకు మాట్లాడుతారని ఎమ్మెల్యే హరీష్‌రావు తెలియజేశారు. తెలంగాణలో ఎక్కడ అన్యాయం జరిగినా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హరీష్‌రావు తేల్చిచెప్పారు.