ముగిసిన తెలంగాణ ఐకాస సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస సమావేశం ముగిసిందిద. తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ పార్టీని నమ్మడానికి లేదని, తెలంగాణ ప్రజలకిచ్చిన హామీని గౌరవించడం లేదని ఐకాస కన్వీనర్‌ కోదండరామ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో స్థానం లేకుండా చూడాలన్నారు. ఎన్నికలు వచ్చినా తెలంగాణకు అనుకూలంగానే ప్రజలు ఓటెయ్యాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణ సాధన కోసం సెప్టెంబరు 30న తెలంగాణ మార్చ్‌ చేపట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కని, ప్రైవేటు పరిశ్రమల్లో 80 శాతం స్థానికులకే అవకాశలివ్వాలని కోదండరాం అన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాలతో మాట్లాడారు.