ముగిసిన వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్ష
హైదరాబాద్: భోధనా ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద మైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన రెండురోజుల దీక్ష ఈరోజు ముగిసింది. బోధన ఫీజుల పథకంతో కిరణ్ సర్కారు వ్యాపారం చేస్తోందని ఆమె ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. విద్యర్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించాలన్న లక్షంతో వైఎస్ ఈ పథకాన్ని ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.