ముత్తూట్ ఫైనాన్స్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి.
ముతుట్ ఫైనాన్స్ మేనేజర్ విక్రమ్ రెడ్డి,
తాండూరు సెప్టెంబర్ 30(జనంసాక్షి) నూతనంగా ప్రారంభించిన ముత్తూట్ ఫైనాన్స్ ఎవరు చేసుకోవాలని ఫైనాన్సు మేనేజర్ విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం తాండూరు పట్టణం శివాజీ చౌక్ సమీపంలో ని కేశవరావు కాంప్లెక్స్ లో నూతనంగా ముతుట్ ఫైనాన్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ముతుట్ ఫైనాన్స్ ను మేనేజర్ విక్రమ్ రెడ్డి,కాంప్లెక్స్ యాజమాని ఊదండ పూర్ మాజీ సర్పంచ్ కేశవరావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముతుట్ ఫైనాన్స్ మేనేజర్ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముత్తూట్ ఫైనాన్స్ సేవలు సద్వినియోగ చేసుకోవాలని కోరారు.
నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం నూతనంగా ముత్తూట్ ఫైనాన్స్ సేవలు ప్రారంభించామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ మేనేజర్ విక్రమ్ రెడ్డి, నిర్వాహకులు , ఊదండ పూర్ మాజీ సర్పంచ్ కేశవరావు, అంజిల్ రెడ్డి ,రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.