మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు మహిళలతో స్వచ్ఛ ప్రతిజ్ఞ


మెట్పల్లి టౌన్, మార్చి 29,జనంసాక్షి :
స్వచ్ఛోత్సవ్ 2023 లో భాగంగా మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు పట్టణంలోని మాల సంఘ భవనం ఎదురుగా మహిళలతో స్వచ్ఛ మసాల్ మార్చ్ నిర్వహించి ర్యాలీ తీస్తూ స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. , పట్టణ ప్రజలు చెత్తను రోడ్లపై గాని, ఖాళీ ప్రదేశాలలో గాని మురికి కాలువలలో వేయరాదు, అలాగే ఖాళీ ప్లాట్ లలో ఇంటి ప్రక్క యజమానులు చెత్తను వేయరాదు. పట్టణ ప్రజలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా అన్నారు. మున్సిపల్ ఆటోలకు మాత్రమే తడి పొడి చెత్త వేరు చేసి చెత్త డబ్బల ద్వారా అందివ్వాలి మెట్పల్లి పట్టణంను స్వచ్ఛ మరియు చెత్తరహిత పట్టణంగా, సుందరంగా తయారు చేయుటకు, ప్రజలందరూ సహకరించాలని స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయడం అయినది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బర్ల మధులత, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, సి ఓ గంగరాణి, జ్యోతి, నిజాం, ఆర్పీలు ఎస్ హెచ్ జి మెంబర్స్, మహిళలు పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు