మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఎం పార్టీ నాయకులు
– సిఐటియు కార్యాలయ ఆస్తులను కాపాడాలి
హుజూర్ నగర్ మార్చి 09(జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డు రైస్ మిల్ ప్రక్కన గల సిఐటియు కార్యాలయ ఆస్తిని కాపాడాలని సిపిఎం పార్టీ సీఐటీయూ ఏఐకేఎస్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం డిమాండ్ చేశారు. పట్టణ పరిధిలోని సిఐటియు కార్యాలయ ఆస్తిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని దానికి సహకరించిన సిబ్బందిపై చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణ ఎదుట సిపిఎం పార్టీ, సీఐటీయూ, ఏఐకేఎస్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి నాగారపు పాండు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కొంతమంది వ్యక్తులతో కలిసి సిఐటియు కార్యాలయానికి సంబంధించిన ఆస్తిని పోతన బోయిన వెంకన్న అను వక్తి అక్రమంగా తన భార్య పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. అనంతరం కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై శాఖపరమైన చర్యలు, అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, సంబంధిత ఉన్నత అధికారులకు తెలియజేస్తామన్నారు. వెంటనే సిఐటియు కార్యాలయ ఆస్తిని పరిశీలించారు. యధాతధంగా ఉంచేందుకు న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పట్టణ కార్యదర్శి నాగారపు పాండు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు పులిచింతల వెంకటరెడ్డి, కౌన్సిలర్ ఇందిరాల త్రివేణి, జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు, మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీలం శీను, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎలక సోమయ్య గౌడ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మ కొమ్మ యోనా, రేపాకుల మురళి, సీనియర్ నాయకులు పాశం వెంకట్ నారాయణ, పిట్టల నాగేశ్వరరావు, శీలం సాంబయ్య, చింతకుంట్ల వీరయ్య, రేపాకుల వెంకన్న, అభిమల్ల జనార్ధన్ రేపాకుల వీరస్వామి, పాశం వీరబాబు, పెన్నపరెడ్డి వెంకటరెడ్డి, నక్కిన బోయిన చెంబయ్య, షేక్, అహ్మద్, కె ,వెంకన్న, దుగ్గి సాయి, గుండు సైదులు, చింతకాయల శీను, ములకలపల్లి శీను, వీర నాగేశ్వరావు, వెంకటేశ్వర్లు, పెద్ద సంఖ్యలో ప్రజాసంఘాల బాధ్యులు పాల్గొన్నారు.